అసిడిటీని నివారించే ముఖ్యమైన ఇంటి చిట్కాలు మీకోసం…

0
21
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హెల్త్‌ డెస్క్‌
నిత్యజీవితంలో అనునిత్యం అసిడిటీతో కొంతమంది బాధపడుతూనే ఉన్నారు. ముఖ్యంగాఛాతి నుంచి గొంతు వరకు మంట ఉండడం.. తిన్న ఆహారం గొంతులోనే ఉన్న భావన కలగడం, కడుపు ఉబ్బరంగా ఉండడం.. ఛాతిలో నొప్పి ఉండడం, నోటి దుర్వాసన, పొడి దగ్గు, ఆయాసం.. తదితర లక్షణాలు అన్నీ అసిడిటీ సమస్య ఉన్నవారిలో కనిపిస్తుంటాయి. అసిడిటీ వచ్చేం దుకు అనేక కారణాలుంటాయి. అవేమైనప్పటికీ ఈ సమస్య గనక ఎవరికైనా వస్తే అప్పుడు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. అయితే అసిడిటీని తగ్గించుకునేందుకు మన ఇంట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాలు చాలు.

అసిడిటీని నివారించే ఇంటి చిట్కాలివే

– హిందువులు తులసి మొక్కను అతి పవిత్రంగా భావించి తమ తమ ఇండ్లలో పూజిస్తుంటారు. తులసి మొక్క ఆకుల్లో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలుంటాయి. తులసి ఆకులను నిత్యం మూడు పూటలా భోజనానికి ముందు నమలుతుంటే అసిడిటీ రాకుండా చూసుకోవచ్చు. అలాగే దీని వల్ల తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది.
– ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను అలాగే నమిలి మింగాలి. పుదీనాలో ఉండే ఔషధ గుణాలు అసిడిటీని తగ్గిస్తాయి. అలాగే భోజనం తరువాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా.. అసిడిటీ నుంచి బయట పడవచ్చు.
– భోజనం చేసిన తరువాత 20 నిమిషాలు ఆగి కొబ్బరినీళ్లు తాగాలి. దీని వల్ల అసిడిటీ తగ్గుతుంది.
– సంత్రా పండ్ల రసాన్ని ఒక గ్లాస్ మోతాదులో తీసుకుని అందులో కొద్దిగా జీలకర్ర పొడి వేసి కలిపి తాగితే అసిడిటీ నుంచి విముక్తి లభిస్తుంది.
– భోజనానికి ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి తాగితే అసిడిటీ రాదు.