అయ్యప్ప భక్తుల కోసం టూరిజం బస్సులను ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం

0
16
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక అభివృద్ధి సంస్థ బస్సులను ఏర్పాటు చేసింది.అనుభవజ్ఞులైన డ్రైవర్లతో మొత్తం 5 రకాల బస్సులను అందుబాటులో ఉంచింది. వీటిని అద్దె ప్రాతిపదికన ఇవ్వాలని నిర్ణయించింది.

మల్టీ యాక్సిల్‌ 47 సీట్ల సామర్థ్యం కల్గిన వోల్వో బస్సుతో పాటు 15 సీట్ల మినీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. రైలు టికెట్లు దొరక్క ఇబ్బంది పడే అయ్యప్ప భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్‌ తెలిపారు.

బస్సుల అద్దెల వివరాలు ఇలా కిలోమీటరు ప్రాతిపదికన అద్దెలతో పాటు మోటారు వెహికిల్‌ టాక్స్‌లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. బస్సులకు తోడు ఏసీ ఇన్నోవాలు కూడా అద్దెలకు పర్యాటకాభివృద్ధి సంస్థ సిద్ధం చేసింది. వివరాలకు నేరుగా హైద రగూడలోని తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయంలో సంప్రదించాలని కోరుతున్నారు.