33వస్తువులపై జి.ఎస్.టి తగ్గింపుకు కేంద్రం నిర్ణయం

0
33
advertisment

మనఛానల్ న్యూస్ – న్యూఢిల్లీ
దేశంలో జి.ఎస్.టి లో మరిన్నీ సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. జి.ఎస్.టి. ప్రభావంతో పలు రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్నదనే వార్తలు వస్తుడడం, అధికార బిజెపి పార్టీ దేశంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్,చత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాలలో ఇటివల జరిగిన ఎన్నికలలో అధికారం కోల్పోవడం వంటి కారణాలతో జి.ఎస్.టి పన్నుల రేట్లు తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది.

ఇందులో భాగంగా శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లీ ఆధ్వర్యంలో జరిగిన జి.ఎస్.టి మండలి సమావేశంలో 33 వస్తువులపై పన్ను తగ్గించాలని కేంద్రం నిర్ణయించిన విషయాన్ని అరుణ్ జెట్లీ  మండలి దృష్టికి తీసుకొచ్చారు.ఇందులో 7 వస్తువులపై పన్నులను 28 నుంచి 18శాతానికి తగ్గించాలని నిర్ణయించిన జీఎస్టీ మండలి మరో 26 వస్తువులపై 18నుంచి 12 శాతం, 5శాతానికి తగ్గించాలని నిర్ణయం తీసుకుంది.

త్వరలోనే ఫిట్‌మెంట్‌ కమిటీ భేటీ అయి మిగిలిన వస్తువులపై పన్ను తగ్గింపు నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటివరకు పన్ను తగ్గింపులోకి రాకుండా 28శాతం పన్ను పరిధిలో ఉన్నవస్తువులపై సమీక్షించి జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం జీఎస్టీ మండలి భేటీ దిల్లీలో కొనసాగుతోంది.