రెబల్‌స్టార్‌ కృష్ణంరాజుకు శోభన్‌బాబు జీవిత సాఫల్య పురస్కారం

0
55
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
తెలుగు ప్రేక్షకులకు రెబల్‌స్టార్‌గా సుపరిచితులైన కృష్ణంరాజుకు దివంగత అందాల నటుడు శోభన్‌బాబు జీవిత సాఫల్య పుర స్కారం లభించింది.కృష్ణంరాజును శోభన్‌బాబు జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించనున్నట్లు శోభన్‌బాబు సేవా సమితి సభ్యులు తెలిపారు.

శోభన్‌ బాబు అభిమానులంతా కలిసి ఈ నెల 25న హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమకు చెందిన 24 విభాగాలకు ప్రత్యేక పురస్కా రాలను ప్రదానం చేస్తున్నారు.

ఈ పురస్కారాల ఆహ్వాన పత్రికను ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, సీనియర్‌ దర్శకులు రేలంగి నర్సింహారావు, సేవా సమితి సభ్యులతో కలిసి విడుదల చేశారు. ఎవర్‌గ్రీన్‌ దర్శకుడిగా రాఘవేంద్రరావు సహా మరో తొమ్మిది మందికి ప్రత్యేక పురస్కారాలను ప్రదానం చేస్తామని పరుచూరి తెలిపారు.