దుబాయ్ లో ఘనంగా క్రూజ్ క్రిస్మస్ వేడుకలు- ఎపి నుంచి హాజరైన నందిగామ ఎం.ఎల్.ఎ తంగిరాల సౌమ్య

0
226
advertisment

మనఛానల్ న్యూస్ – గల్ప్ ప్రతినిధి
ప్రవాసాంద్రుల క్రిస్మస్ వేడుకలు శుక్రవారం రాత్రి దుబాయ్ లో దెరా కీరక్క్ సమీపం లో ఎపి ఎన్.ఆర్.టి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకొన్నారు. ఈ కార్యక్రమం క్రూజ్ క్రిస్మస్ కోఆర్డినేటర్ వాసు మరియు ఖాదర్ షేక్ పర్యవేక్షణలో జరుపుకొన్నారు.

అత్యంత వైభవంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ నుంచి నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య ఆతిధిగా హాజరయ్యరు. ఈ సందర్భంగా ఆమె గల్ఫ్ దేశాలలో ఉన్న తెలుగు రాష్ట్రాల క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలియచేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ ప్రేమ,శాంతి క్రైస్తవం లో కనిపిస్తాయని, ప్రేమతో దేనినైనా జయించవచ్చునని అన్నారు. యేసు క్రీస్తు మార్గం ప్రతి ఒక్కరు అనుసరించాలన్నారు .ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్ లు ,ఎన్ఆర్ఐ టిడిపి నాయకులు ,ఏపి ఎన్ ఆర్ టీ కో ఆర్డీనేటర్లు పాల్గోన్నారు.