ప్రభాస్‌ పిటిషన్‌పై కీలక ఆదేశాలు జారీచేసిన హైకోర్టు

0
21
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
తన గెస్ట్‌హౌస్‌ వ్యవహారంలో ప్రముఖ హీరో ప్రభాస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. యథాతధ స్థితిని కొనసాగించాలని పేర్కొంది. విచా రణను వాయిదా వేసింది. గెస్ట్‌హౌస్‌ సీజ్‌పై సినీ నటుడు ప్రభాస్ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.

కేవలం సీజ్‌ మాత్రమే చేశామని, ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం ఈ పిటిషన్‌పై ఈ నెల 24న కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 31కి వాయిదా వేసింది.

హైదరాబాద్‌ రాయదుర్గంలోని పన్మక్తా గ్రామ రెవెన్యూ సర్వే నంబరు 46లో గల 84 ఎకరాల 30 గుంటల భూమి ప్రభుత్వాని దేనంటూ సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో శేరిలింగంపల్లి తహసీల్దార్‌ వాసుచంద్ర ఆ స్థలంలోని నిర్మాణాలు తొలగించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో ప్రభాస్‌ ఇల్లు ఉండటంతో దాన్నీ అధికారులు సీజ్‌ చేశారు.