రాజ్యాంగ హక్కులను రక్షించాలంటూ మదనపల్లి సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట వామపక్షాల ధర్నా

0
17
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
భారత రాజ్యాంగలోని హక్కులను రక్షించాలంటూ మదనపల్లి సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట గురువారం వామపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాలమహానాడు జాతీయ నాయకులు యమలా సుదర్శనం మాట్లాడుతూ డా.బి. ఆర్‌. అంబేద్కర్‌ రాజ్యాంగంలో పొందుపరిచిన రాజ్యాంగపరమైన హక్కులను కాలరాస్తున్నారని ఆయన విమర్శించారు.

సాంకేతికపరంగా భారత దేశం ఎంతో అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాలపై దాడులు జరుగుతుండడం బాధాకరమన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసం మరిన్ని చట్టాలు రూపొందించాల్సిందిపోయి, ఉన్న చట్టాలకు తూట్లు పొడిచి వారి స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ నిమ్నవర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారన్నారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో మాత్రమే ఎస్సీ, ఎస్టీలపై కపటప్రేమ చూపిస్తారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్టీ, ఎస్టీలను విస్మరించడం ఆనవాయితీ గా మారిపోయిందన్నారు.

మానవుడు స్వేచ్ఛాయుత జీవనం గడుపడానికి రాజ్యాంగ హక్కులను రక్షించాల్సిన బాధ్యత అధికారులు, ప్రభుత్వాలపైన ఎంతైనా ఉందని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి సాంబశివ, సిపిఎం డివిజన్‌ కార్యదర్శి శ్రీనివాసులు, ఏఐటియుసి నాయకులు రాజ్‌ కుమార్‌, మురళి, జనసేన నాయకులు, మాలమహానాడు నాయకులు పాల్గొన్నారు.