మిట్స్ లో ఇరువురు విద్యార్థులు ఇంటర్నషిప్ కు ఎంపిక

0
43
advertisment

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
మదనపల్లి లోని మిట్స్ ఇంజనేరింగ్ కాలేజికి చెందిన బి.టెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE ) విభాగంలో చివరి సంవత్సరం చదువుతున్న ఎల్. స్నేహ మరియు పి. వర్షిణి అను విద్యార్థులు బెంగళూరు కు చెందిన కోడివా సాఫ్ట్వేర్ సోలుషన్స్ కంపెనీకి ఇంటర్న్ షిప్ కు ఎంపిక అయినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు.

కంపెనీ వారు నిర్వహించిన ఇంటర్వ్యూ లో ప్రతిభ కనబరిచిన ఈ విద్యార్ధినులకు జనవరి 2019 నుండి 6 నెలల పాటు కంపెనీలో ఇంటెర్షిప్ కు పాల్గొంటారని ఆయన అన్నారు. ఈ విద్యార్థులకు నెలకు 8000 రూపాయల స్టైఫండ్ అందజేస్తారని ఆయన అన్నారు.

ఈ ఇంటర్న్షిప్ ద్వారా విద్యార్థికి ఎలక్ట్రానిక్ రంగం లో నూతన పరిశోధనలు చేయుటకు అవకాశం లభించిందని ఆయన అన్నారు. ప్రతిభ కనబరిచిన ఈ విద్యార్థిని కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్, సీనియర్ ప్లేసెమెంట్ ఆఫీసర్ సర్వాన్ బాబు, విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్, అధ్యాపకులు మరియు తోటి విద్యార్థులు అభినందనలు తెలియజేశారు.