మదనపల్లి 1వ వార్డులో ‘‘రావాలి జగన్‌’’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.తిప్పారెడ్డి

0
104
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
పట్టణ శివారుప్రాంతాల్లోని కాలనీల్లో నివసిస్తున్న ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మదనపల్లి ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని 1వ వార్డు పరిధిలోని చంద్రకాలనీ, అనపగుట్ట, గురుకుల పాఠశాల ప్రాంతాల్లో ‘‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ముందుగా ఆ కాలనీల్లోని ప్రజలకు నవరత్నాల పథకాల గురించి వివరించి వారికి అవగాహన కల్పించారు.అనంతరం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

ముఖ్యంగా మురుగునీటి కాలువలు, త్రాగునీరు, వీధిలైట్లు, పారిశుద్ధ్యం తదితర సమస్యలపై అనేకసార్లు ప్రజలు అధికారులు దృష్టికి తీసుకుపోయినప్పటికీ వాటిని పరిష్కరించకపోవడం శోచనీయమన్నారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన వార్డు బాట కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదన్నారు.

వార్డుబాట కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను పక్కన పెట్టేస్తున్నారన్నారు.గతంలో పట్టణాల్లో నివసిస్తున్న నిరుపేదల కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కొన్నివేల ఇళ్లు కట్టించారన్నారు. మళ్లీ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే వైఎస్సార్‌సీపీని ఆదరించాలన్నారు. జగనన్నతోనే రాజన్న రాజ్యం సాకారమవుతుందన్నారు.

advertisment

రాబోవు ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ మెజారిటీతో ఘనవిజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం అయ్యప్పనగర్‌లో జరిగిన భారత రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్‌ వర్ధంతి వేడుకల్లో పాల్గొని, అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు మేస్త్రీ శీనా, నాగిరెడ్డి, అశోక్‌, శివ భాస్కర్‌, నల్లచెరువు బాషా, రమణ, సుధాకర్‌, నగేష్‌, శ్రీనాథ్‌, ప్రభాకర్‌ రెడ్డి, రామ్మోహన్‌, ముని తదితరులు పాల్గొన్నారు.