మదనపల్లి ఏఐటియుసి కార్యాలయంలో డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి

0
29
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
ఆధునిక మనువు, భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 62వ వర్ధంతి వేడుకలను మదనపల్లి ఏఐటియుసి కార్యాలయం నందు గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ఈ సందర్బంగా సిపిఐ ఏరియా కార్యదర్శి పి.సాంబశివ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్‌ పాత్ర మరువలేనిదన్నారు.

ముసాయిదా కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులపాటు పలు రాజ్యాంగాలను విశ్లేషించి అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించారు. నిమ్నవర్గాల అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారన్నారు. రౌండ్‌ టేబుల్‌ సమా వేశంలో గాంధీగారితో కలసి పాల్గొన్నారు. తద్వారా భారత స్వాతంత్య్రం సాధనలో తనదైన కీలకపాత్ర పోషించారు.

అపర మేధావి అయిన అంబేద్కర్‌ భారతదేశంలో అనేక సవాళ్లను అధిగమిస్తూ నిమ్నవర్గాల హక్కుల పరిరక్షణకు చేసిన కృషి మరువులేనిదని వారు కొనియాడారు. అంబేద్కర్‌ ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంద న్నారు.

నేటి విద్యార్థులు అంబేద్కర్‌ని ఆదర్శంగా తీసుకొని భారతదేశ పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు రాజ్‌కుమార్‌, వీరభాస్కర్‌, సిపిఐ నాయకులు మురళి, చంద్రశేఖర్‌ మరియు ఏఐ ఎస్‌ఎఫ్‌ నాయకులు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.