బి.కొత్తకోటలో విస్తృతంగా జనసేన తరంగం కార్యక్రమం

0
25
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – బి.కొత్తకోట
చిత్తూరుజిల్లా బి.కొత్తకోటలో జనసేన తరంగం కార్యక్రమాన్ని గురువారం విస్తృతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన రాజంపేట పార్లమెంట్‌ ఇంఛార్జ్‌ మైఫోర్స్‌ మహేష్‌ హాజరయ్యారు.

ముందుగా భారతరాజ్యాంగ పిత డా.బిఆర్‌.అంబేద్కర్‌ 62వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతిచౌక్‌ నుండి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మహేష్‌ మాట్లాడుతూ జనసేన తరంగం కార్యక్రమం తంబళ్ళపల్లె నియోజకవర్గ స్థాయిలోని అన్ని మండలాలలో విస్తృతంగా ప్రచారం చేస్తూ జనసేన పార్టీ యొక్క మ్యానిఫెస్టోలోని అంశాలు మరియు పార్టీ సిద్ధాంతాలను బలంగా ఇంటి ఇంటికి తీసుకెళతామన్నారు.

ఇందులో భాగంగా తంబళ్ళపల్లె జనసేన నాయకులు జనతరంగo నియోజకవర్గ పరిశీలికులు ఎల్. ఫాజిల్ ఖాన్, రెడ్డి మోహన్, బండి వేంకటేశ్వరులు, నాగలక్ష్మిలతో పాటు మండల నాయకులు మహమ్మద్, మనోహర్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.