ఫోర్బ్స్‌ టాప్‌-100 సంపన్నుల జాబితాలో తెలుగు హీరోల స్థానాలు ఇవే…

0
19

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ సినిమా తారలు ప్రతి ఏడాది ఎంత సంపాదిస్తున్నారో లెక్కించి ఓ జాబితాను తయారు చేసి విడుదల చేస్తుంటుంది.ఈ ఏడాది కూడా తన టాప్‌ 100 జాబితాను విడుదల చేసింది. 2017 అక్టోబర్‌ 1 నుంచి సెప్టెబర్‌ 30, 2018 వరకూ తారల సినిమాల రిలీజ్‌లు, చేసిన బ్రాండ్‌ ప్రమోషన్స్‌ అన్నింటినీ లెక్కకట్టి ఎక్కువగా సంపాదించే వంద మంది ఇండియన్‌ సెలబ్రిటీల లిస్ట్‌ ఇచ్చింది.

ఈ ఏడాది అత్యంత సంపాదించిన వాళ్లలో సల్మాన్‌ ఖాన్‌ నిలిచారు. వరుసగా మూడోసారి ఈ లిస్ట్‌లో టాప్‌లో నిలిచారు సల్మాన్‌ ఖాన్‌. ఈ కండలవీరుడు సుమారు 253 కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నట్టు పేర్కొంది ఫోర్బ్స్‌.మూడో స్థానంలో అక్షయ్‌ కుమార్‌ (185 కోట్లు) ఉన్నారు. ఈ జాబితాలో సౌత్‌ హీరోల్లో రజనీకాంత్‌ టాప్‌లో ఉన్నారు.

50 కోట్లు సంపాదిస్తూ 14వ పొజిషన్‌లో నిలిచారు రజనీ. ఆ తర్వాత 31కోట్ల సంపాదనతో పవన్‌ కల్యాణ్‌ 24వ పొజిషన్‌లో నిలిచారు. 28 కోట్లు సంపాదిస్తూ ఎన్టీఆర్‌ 28వ స్థానంలో నిలిచారు. 33, 34, 36 స్థానాల్లో మహేశ్‌బాబు (24.33 కోట్లు), సూర్య (23. 67 కోట్లు), నాగార్జున (22.25 కోట్లు) నిలిచారు.

బ్లాక్‌బస్టర్‌ సినిమాల దర్శకుడు కొరటాల శివ కూడా ఈ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు.20 కోట్ల సంపాదనతో 39వ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్‌ (15.67 కోట్లు), రామ్‌చరణ్‌ (14 కోట్లు), లేటెస్ట్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ (14 కోట్లు) 64,72, 72 స్థానాల్లో ఉన్నారు.

గతేడాది రెండో స్థానంలో నిలిచిన షారుక్‌ ఈ ఏడాది 13వ స్థానంలోకి వెళ్లారు. ఈ ఏడాది ఒక్క సినిమా రిలీజ్‌ కూడా లేకపోవ డమే దానికి కారణం. అలాగే గతేడాది 7వ స్థానంలో నిలిచిన ప్రియాంక ఈ సంవత్సరం 49వ స్థానానికి చేరుకున్నారు.