పూజారా శతకం – ఆడిలైడ్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 250/9

0
10
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో ప్రారంభమైన తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 9 వికెట్ల నష్టానికి 250 పరుగు చేసింది. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ చతేశ్వర పూజారా (123 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు.

ఒక దశలో 41/4 క్లిష్టపరిస్థితిలో ఉన్న భారత్‌ను పూజారా, రోహిత్‌ శర్మ ఆదుకున్నారు. అయితే రోహిత్‌ శర్మ (37, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) లయన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. చివర్లో రిషబ్‌ పంత్‌ (25), రవిచంద్రన్‌ అశ్విన్‌ (25) పరుగుల సహకారంతో పూజారా భారత్‌ స్కోరును 250 పరుగులు దాటించాడు.

ఇన్నింగ్స్‌ మరికాసేపట్లో ముగుస్తుందనంగా పూజారా రనౌటయ్యాడు. పూజారా అవుటైన వెంటనే తొలి రోజు ఆటను అంపైర్లు నిలిపివేశారు. దీంతో భారత్‌ 250/9తో నిలిచింది. లోకేశ్‌ రాహుల్‌ (2), మురళీ విజయ్‌ (11), కోహ్లీ (3), రహానే (13) విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 2, హేజిల్‌వుడ్‌ 2, కమ్మిన్స్‌ 2, లయన్‌ 2 వికెట్లు పడగొట్టారు.