పసిఫిక్‌ మహాసముద్రంలో కూలిన రెండు అమెరికా సైనిక విమానాలు

0
84

మనఛానల్‌ న్యూస్‌ – ఇంటర్నేషనల్‌ డెస్క్‌
పసిఫిక్‌ మహాసముద్రంలో అమెరికా సైన్యానికి చెందిన రెండు విమానాలు కూలిపోయాయి.ఈ ప్రమాదంలో విమానాల్లో ఉన్న ఆరుగురు మెరైన్లు( నావికాదళ సిబ్బంది) గల్లంతయ్యారు. జపాన్‌కు నైరుతి వైపు సముద్రంలో ఈ ఘటన జరిగింది.

గురువారం తెల్లవారుజామున ఎఫ్-18 యుద్ధవిమానం, సీ-130 రిఫ్యూయెలింగ్‌ విమానం సాధారణ శిక్షణలో ఉండగా రెండు విమానాలు గగనతలంలో ప్రమాదానికి గురై సముద్రంలో పడిపోయాయి. ఆకాశంలో ఉండగా ఇంధనం నింపే ఆపరేషన్‌ చేపడు తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు జపాన్‌ రక్షణ మంత్రి వెల్లడించారు.

సముద్రంలో పడిపోయి గల్లంతైన సిబ్బందిలో ఒకరిని సహాయక సిబ్బంది రక్షించారు. గల్లంతైన మిగతా మెరైన్ల కోసం గాలి స్తున్నారు. సీ-130లో ఐదుగురు సిబ్బంది, ఎఫ్‌-18లో ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు విమానాలు, మూడు నౌకలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.

దక్షిణ జపాన్‌లోని ఇవకునిలో మెరైన్‌ కార్ప్స్‌ ఎయిర్‌ స్టేషన్‌ నుంచి రెండు విమానాలు బయలుదేరిన అనంతరం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యాయని వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు మిలిటరీ వెల్లడించింది.