కేంద్ర ఎన్నికల సంఘానికి కూకట్‌పల్లి తెదేపా అభ్యర్థి సుహాసిని ఫిర్యాదు

0
21

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గ తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు పోలీసులు సహకరిస్తున్నారని తెదేపా అభ్యర్థి నందమూరి సుహాసిని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు, కూకట్‌పల్లి ఏసీపీ సురేంద్ర తెరాస అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆ ఇద్దరు అధికారులను బదిలీ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబానికి చెందిన మహిళలను తెరాస కార్యకర్తలు బెదిరిస్తు న్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోని అల్లాపూర్‌, ఓల్డ్‌ బోయిన్‌పల్లి ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సుహాసిని ఎన్నికల సంఘాన్ని కోరారు.