కియా మోటార్స్‌తో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవగాహన ఒప్పందం

0
24
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – విజయవాడ
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్‌తో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఆటో మొబైల్‌ రంగంలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాబోయే తరం పర్యావరణ రవాణాపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో గురువారం అవగాహన ఒప్పందం కుదిరింది.

అనంతరం సచివాలయంలో ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌, ఎలక్ట్రిక్‌ కార్లను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.సీఎం ప్రారం భించిన నిరో హైబ్రిడ్‌, నిరో ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌, నిరో ఎలక్ట్రికల్‌ కార్లను కియా మోటార్స్‌ రాష్ట్ర ప్రభుత్వానికి బహుమతిగా ఇచ్చింది.

ఈ కార్లు ఒక్కసారి ఛార్జింగ్‌ చేసుకుంటే 455 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే వీలుంటుంది. త్వరలో విజయవాడలో వెహికల్‌ ఛార్జింగ్‌ స్టేషన్లను కియా మోటార్స్‌ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఆ కంపెనీ అనంతపురంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.