ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఐక్యతతోనే దేశాభివృద్ధి – ఐయుఎంఎల్‌ రాష్ట్ర కార్యదర్శి షేక్‌ సాబిరా

0
45
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఐక్యతతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ రాష్ట్ర కార్యదర్శి, చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు షేక్‌ సాబిరా అన్నారు. గురువారం (డిసెంబర్‌ 6) బ్లాక్‌ డేను పురస్కరించుకొని మదనపల్లి ప్రెస్‌క్లబ్‌ కార్యాల యం నందు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ దినం భారతదేశంలో ముస్లిం మైనారిటీలకు అత్యంత బాధాకరమైన దినమని అందరూ భావిస్తారని, కానీ ఇదే తేదీన అసలైన రహస్యం ఒకటుందని ఆమె పేర్కొన్నారు. రాజ్యాంగ సృష్టికర్త అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి కూడా ఇదే తేదీనేనన్నారు.

కొన్ని మతతత్వ పార్టీలు, మరియు మతతత్వ సంఘాలు, మైనారిటీలను షెడ్యూల్ కులాలను అణచి వేసే దృష్టితో ఇదే తేదీని ఖరారు చేసుకున్నారు. అంబేద్కర్ గారి వర్ధంతి రోజున బాబ్రీ మసీదు కూల్చివేత ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని ఆమె అన్నారు.

షెడ్యూల్ కులాల వారు మరియు మైనారిటీలు ఏకమై అగ్రవర్ణాల వారిని రాజకీయంగా ఎదుర్కొనే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, వాస్తవాలను దేశంలోని ఎస్సీ, ఎస్టీలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారని ఆమె అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రాజ్యాధికారం భారతదేశానికి చారిత్రాత్మక అవసరమన్నారు.

ప్రస్తుత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హక్కులను కాలరాస్తున్నారన్నారు. అన్ని వర్గాల వారిని తమ పార్టీ ఆదరిస్తుందని అవకాశం ఇస్తుందని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్‌, మాధవ తదితరులు పాల్గొన్నారు.