ఆవులపల్లి పాఠశాలలో అంబేద్కర్ వర్థంతి సభ – విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

0
54
advertisment

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం ఆవులపల్లి ప్రాథమికోన్నత పాఠశాల లో గురువారం అంబేద్కర్ వర్థంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యాకమిటి ఛైర్మన్ చంద్ర పాల్గోన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. పాఠశాల స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడు ఆర్.వి.రమణ మాట్లాడుతూ భారత రాజ్యంగ రచనలో…
బడుగులు,అణగారిన వర్గాల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు.

ఆయన లేకపోయినట్లు అయితే బడుగుల అభివృద్ది, సంక్షేమం జరిగేది కాదని అన్నారు. విద్యార్థులు అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈకార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గోన్నారు.ఈసందర్భంగా విద్యార్థులకు ఉచితంగా కాపిరైటింగ్ పుస్తకాలు అందచేశారు.