శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్ర

0
15

మనఛానల్‌ న్యూస్‌ – శ్రీకాకుళం
ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 313వ రోజుకు చేరుకుంది. ఈ పాదయాత్ర ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా, అశేష జనవాహిని మధ్య కొనసాగుతోంది.

313వ రోజు బుధవారం ఉదయం సంతవురిటి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి దవళ పేట, ఆనందపురం ఆగ్రహారం, వాండ్రంగి మీదుగా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరుకు చేరుకుంటారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 02:45కి పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది.

అక్కడి నుంచి రాపాక జంక్షన్‌, ఎరుకలపేట క్రాస్‌, కృష్ణాపురం మీదుగా రెడ్డి పేట వరకు నేడు పాదయాత్ర సాగనుంది. తమ సమస్యలను పరిష్కారించడానికి వస్తున్న జగనన్నను చూడడానికి ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.