వేలంలో రూ.20 కోట్లు పలికిన ఐన్‌స్టీన్‌ లేఖ

0
20
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఇంటర్నేషనల్‌ డెస్క్‌
విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ రాసిన ‘‘గాడ్‌ లెటర్‌’’ వేలంలో భారీ ధర పలికింది. ఆయన చనిపోవడానికి కేవలం ఒక సంవత్సరం ముందు దేవుడు, మతంపై తన ఆలోచనలను లేఖలో రాశారు. అది ‘గాడ్‌ లెటర్‌’ గా ప్రసిద్ధి.

ఈ లేఖను అమెరికాలో క్రిస్టీస్‌ సంస్థ వేలం వేయగా 2.89మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.20కోట్లు) పలికింది. కిస్ట్రీస్‌ ఈ లేఖకు 1.5మిలియన్‌ డాలర్లు పలుకుతుందని అంచనా వేసింది. కానీ అంచనాలను మించి భారీ ధర పలికింది.

రెండు పేజీల ఆ లేఖను ఐన్‌స్టీన్‌ 1954 జనవరి 3వ తేదీన రాశారు. దానిని జర్మన్‌ ఫిలాసర్‌ ఎరిక్‌ గుట్‌కైండ్‌కు పంపించారు. ఎరిక్‌ తాను రాసిన ‘చూజ్‌ లైఫ్‌: ద బిబ్లికల్‌ కాల్ టూ రివోల్ట్‌’ పుస్తకాన్ని ఐన్‌స్టీన్‌కు పంపించగా తర్వాత ఐన్‌స్టీన్‌

ఆయనకు దేవుడు, మతం గురించి తన ఆలోచనలు వివరిస్తూ లేఖ రాసి పంపారు. తనకు సంబంధించి దేవుడు అనే పదం ఓ వ్యక్తీకరణ అని, మనుషుల బలహీనత నుంచి వచ్చిందని ఐన్‌స్టీన్‌ లేఖలో పేర్కొన్నారు.