వడ్డీరేట్లను యధాతథంగా ఉంచిన ఆర్‌బీఐ

0
25
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఎకానమీ డెస్క్‌
కీలక వడ్డీరేట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వరుసగా రెండోసారీ యధాతథంగా ఉంచింది.ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని ఆర్థిక‌ నిపుణులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగానే ఆర్‌బీఐ కీలక రేట్లను యథాతథంగా ఉంచింది.

ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ బుధవారం వెల్లడించింది. గతంతో పోలిస్తే చమురు ధరలు తగ్గడం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో ఆర్‌బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. తదుపరి ద్వైమాసిక సమీక్ష 2019 ఫిబ్రవరి 5 నుంచి మూడు రోజుల పాటు జరగనుంది.

రిజర్వ్‌ బ్యాంకు సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు

– రెపో రేటులో ఎలాంటి మార్పు లేదు. యథాతథంగా 6.5శాతం వద్దే ఉంది. (గత అక్టోబరు సమీక్షలోనూ రెపో రేటును మార్చలేదు)
– రివర్స్‌ రెపో రేటు 6.25శాతం, బ్యాంకు రేటు 6.75శాతంగా ఉంది.
– 2018-19 ఆర్థిక సంవత్సరానికిగానూ జీడీపీ వృద్ధి రేటు 7.4శాతంగా, 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగానికి గానూ జీడీపీని 7.5శాతంగా అంచనా వేసింది.
– అక్టోబరు – మార్చి కాలంలో ద్రవ్యోల్బణం 2.7-3.2శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.