రెండో రోజు నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

0
11
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – బిజినెస్‌ డెస్క్‌
అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉండటం, ముడిచమురు ధరలు మళ్లీ పుంజుకోవడం, ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం మార్కెట్లపై ప్రభావం చూపించాయి.

దీంతో వరుసగా రెండో రోజు దేశీయ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి.ఫలితంగా నేటి ఆద్యంతం సూచీలు నష్టాల్లో సాగాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ మళ్లీ 36వేల దిగువకు పడిపోగా జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 10,800 మార్క్‌ను కోల్పోయింది.మదుపర్ల అమ్మకాలతో ఈ ఉదయం మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యాయి.

మార్కెట్‌ ఆరంభంలో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా కోల్పోయింది. ఒక దశలో 300 పాయింట్లకు పైగా దిగజారి ట్రేడ్‌ అయిన సూచీ చివరకు కాస్త కోలుకుని 250 పాయింట్ల నష్టంతో 35,884 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 80 పాయింట్లు కోల్పోయి 10,789 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.63గా కొనసాగుతోంది.