నందమూరి సుహాసిని తరపున ప్రచారాని దూరమైన జూ.ఎన్టీఆర్‌

0
25
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని తరపున ప్రచారానికి వస్తున్నట్లు జూనియర్‌ ఎన్టీఆర్‌, నందమూరి కళ్యాణ్‌రామ్‌లో గతంలో తెలిపిన సంగతి విదితమే.

అయితే వారు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడం వలన ప్రచారానికి రావడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌లు ప్రచారానికి వస్తే అత్యధిక మెజారిటీతో సుహాసిని విజయం సాధిస్తుందని తెదేపా నాయకులు బహిర్గతం చేశారు.

ఇప్పటికే ఆమె తరపున ప్రచారానికి నందమూరి బాకృష్ణతోపాటు కూటమి నాయకులు పాల్గొంటూ తమ మద్ధతు ప్రకటిస్తున్నారు. అదేవిధంగా ఎన్నికల ప్రచారం చివరి అంకానికి రావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో విజయం కోసం తమ ప్రచారాలను మరింత ముమ్మరం చేశారు.