ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టు పేరును ఢిల్లీ క్యాపిటల్స్‌గా మార్పు

0
13

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
2019 సీజనే లక్ష్యంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టు సరికొత్త పంథాకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ‘దిల్లీ డేర్‌ డెవిల్స్‌’గా ఉన్న పేరును ‘దిల్లీ క్యాపిట్సల్‌’గా మార్చింది. లోగో ఆకృతినీ సరికొత్తగా డిజైన్‌ చేసింది.

డాలు మధ్యలో దిల్లీ క్యాపిటల్స్‌ పెద్ద అక్షరాలు, వాటి కింద మూడు ఎరుపు రంగు పులులు గాండ్రిస్తున్న చిత్రాన్ని ఉంచింది. పదకొండేళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఆ జట్టు కేవలం మూడు సార్లు మాత్రమే ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. అన్నీ కుదిరినా ఆ జట్టుకు అచ్చిరాకపోయిన సందర్భాలెన్నో ఉన్నాయి.పేరు మార్పుతో పాటు జట్టుకు నాయకత్వం వహించేదెవరో దిల్లీ ప్రకటించింది.

యువ ఆటగాడు, ముంబయి రంజీ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను సారథిగా ప్రకటించింది. గత సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు గౌతమ్‌ గంభీర్‌ సారథ్యం వహించాడు. అతడు ఫామ్‌లో లేకపోవడంతో శ్రేయస్‌కే పగ్గాలు అప్పగించారు. ఇప్పుడూ అతడినే కొనసాగి స్తున్నారు.

శిఖర్‌ ధావన్‌ జట్టులోకి రావడం కలిసొస్తుందని ఆ జట్టు భావిస్తోంది. అలాగే రిషభ్‌పంత్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. దిల్లీకి ఆడాలని ఉందంటూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను వదిలేసి వచ్చిన గౌతీకి ఆ ఫ్రాంచైజీ మొండిచేయి చూపించింది. అతడిని వేలానికి వదిలేసింది.