311వ రోజు ప్రారంభమైన వై.ఎస్‌.జగన్‌ ప్రజాసంకల్పయాత్ర

0
26
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – శ్రీకాకుళం
ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తిలకించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌ చేపట్టి ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో అశేష జనవాహిని మధ్య సాగుతోంది. ఇప్పటికే 3,360 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసి వై.ఎస్‌.జగన్‌ రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు.

311వ రోజు ప్రజాసంకల్పయాత్రను జగన్‌ సోమవారం ఉదయం బూరాడనుంచి కొనసాగించారు. అక్కడి నుంచి కొర్లవలస క్రాస్‌, గురవాం, రాజాం మీదుగా అంతకాపల్లి వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం రాజాంలో జరిగే భారీ బహిరంగ సభలో జననేత ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ

ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు.