విశ్వం జూనియర్ కాలేజీలో ఈవిటిజింగ్ పై విద్యార్థులకు షీటిమ్ అవగాహన కార్యక్రమం

0
104
advertisment

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
మదనపల్లిలోని విశ్వం జూనియర్ కాలేజీలో విద్యార్థులకు ముదివేడు పోలీస్ స్టేషన్ కు చెందిన షీటిమ్ సిబ్బంది సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన శిక్షణలోనున్న మహిళా సబ్ ఇన్స్ పెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ తో విద్యను అభ్యసించాలని, అసాంఘిక కార్యకలపాలకు దూరంగా ఉండాలని సూచించారు.

ముఖ్యంగా కళశాలలో ఈవిటిజింగ్, ర్యాగింగ్ వంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, అలాంటి వాటిని ప్రోత్సహించరాదని కోరారు. ఏవరైనా ఈ చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠినంగా శిక్షించాల్సి ఉంటుందని తెలిపారు. దీనివల్ల భవిష్యత్ దెబ్బతింటుందని అన్నారు.

అలాగే విద్యార్థులు డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్లలో మాట్లాడుతూ చేయరాదని, హెల్మెట్ లేకుండా వాహనాలను నడపరాదన్నారు. బాల్యవివాహల వల్ల కల్గే అనర్థాలను ఆమె విద్యార్థులకు వివరించారు.

advertisment

ఇంటర్మీడియట్ విద్యార్థులు అధికంగా మిస్సింగ్ అవుతున్నారని కావున జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదివేడు పోలీస్ స్టేషన్ షీటీమ్ సిబ్బంది, కళశాల ప్రిన్సిపాల్ కొండారెడ్డి, అద్యాపకులు పాల్గోన్నారు.