మార్చి 18 నుంచి ఏపిలో 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలు

0
33

మనఛానల్‌ న్యూస్‌ – విజయవాడ
మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2, 2019 వరకు ఏపిలో 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఆయన విడుదల చేశారు.

అదేవిధంగా పరీక్షల దరఖాస్తుకు ఈ నెల 7న చివరి తేదీగా పేర్కొన్నారు. పరీక్షలకు మొత్తం 6.10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, 2,833 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. 91 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలు గుర్తించామని, ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. హాల్‌టికెట్లను ప్రధానోపాధ్యాయులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. పరీక్షలు జరిగిన నెల రోజులకే ఫలితాలను విడుదల చేస్తామన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. ఇప్పటికే ఆంగ్ల మాధ్యమంలో బోధన అందిస్తున్నామని తెలిపారు.