మలేషియాలో మిట్స్ విద్యార్థి ప్రతిభ

0
45

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణానికి సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థి మలేషియాలో నిర్విహించిన అంతర్జాతీయసదస్సులో ప్రతిభకనబరిచినట్లు కళశాల ప్రన్సిపాల్ డాక్టర్ సి. యువరాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

తమ కళశాలలో సివిల్ విభాగంలో ఎం.టెక్ – స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ – రెండవ చదువుతున్న ఎ. మోహన్ కుమార్ మలేషియాలో జరిగిన అంతర్జాతీయ సదస్సు లో పాల్గోని తన ప్రతిభ కనపరిచినాడన్నారు.

మలేసియా దేశం లోని ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ మలేసియా నిర్వహించిన “14th అంతర్జాతీయ సదస్సు అయిన “కాన్పిరెన్స్ ఆన్ అప్లైడ్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ” అను సదస్సులో ” యూజస్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ వేస్ట్ ” అను అంశంపై చేసిన పరిశోధనను ఆసదస్సులో విశ్లేషణాత్మకంగా వివరించి ప్రతిభ కనపరిచాడని, దీంతో అతని ప్రపంచస్థాయి లో రెండవ బహుమతి లభించిందని ఆయన అన్నారు.

ఈ విద్యార్థి పరిశ్రమలలో ఉన్నవృధా అయిన సరుకును సిలికా ఫ్యూమ్, ఫ్లై యాష్, వరిపట్టు మొదలైన వాటిని ఉపయోగించి కట్టడాలతో సిమెంటు కు బదులుగా వీటిని ఉపయోగిచవచ్చని, దానికి సంబంధించిన పరిశోధన ను వివరించినందుకు విద్యార్థికి రెండవ బహుమతి లభించిందని ఆయన అన్నారు.

ఈ పరిశోధనను కళాశాలలోని సివిల్ ప్రొఫెసర్ డాక్టర్. పవన్ కుమార్ పర్యవేక్షణలో నిర్వహించారన్నారు. ప్రపంచస్థాయి లో ప్రతిభ కనపరిచిన మోహన్ ను ప్రిన్సిపాల్ డాక్టర్. సి. యువరాజ్,కళాశాల యాజమాన్యం, సివిల్ విభాగాధిపతి డాక్టర్. దిపంకర్ రాయ్, డాక్టర్. అబ్దుల్ అక్బర్ మరియు అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలియజేసారు.