ఎన్నికలకు సర్వం సిద్ధం – తెలంగాణ ఎన్నికల సీఈవో రజత్‌ కుమార్‌

0
48
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
తెలంగాణ ముందస్తు ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ తెలిపారు. నెలరోజుల్లో ఎన్నికలకు సిద్ధం కావడం ఆషామాషీ విషయం కాదని, దీనికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, వాటన్నింటినీ అధిగమించి ఎన్నికలకు సిద్ధమవ్వడం గొప్ప విషయమన్నారు.

ఎన్నికల సంసిద్ధతపై ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ అనేది ఒక సవాల్‌ అన్నారు. న్యాయపరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించిందన్నారు.

మొత్తం 4.93 లక్షల బోగస్‌ ఓట్లు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే అభ్యర్థుల క్రిమినల్‌ రికార్డులను సేకరించామని, పార్టీల మేనిఫెస్టోలు, హామీలను పరిశీలిస్తున్నామని రజత్‌కుమార్‌ చెప్పారు.