పృథ్వీ షా స్థానంలో రోహిత్‌శర్మను ఎంపిక చేయాలి – మైఖేల్‌ వాన్‌

0
17
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో గాయపడి ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరిగే తొలి టెస్టుకు పృథ్వీ షా దూరమైన సంగతి విదితమే. అతడి స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే విషయంపై సందిగ్ధం నెలకొంది. ఈ మధ్య కాలంలో ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌లలో ఎవరో ఒకర్ని దింపాలని సీనియర్లు, క్రికెట్‌ విశ్లేషకులు, అభిమానులు సూచిస్తున్నారు.

ఆసీస్‌ జట్టులో సీనియర్‌ ఆటగాళ్లు వార్నర్‌, స్మిత్‌ లేనప్పటికీ ఆసీస్‌ జట్టు అంత బలహీనంగా ఏం లేదు. దీంతో టీమిండియా కంగారూ గడ్డపై నిలిచి గెలవాలంటే మాత్రం ఆచితూచి అడుగేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జట్టు ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సీనియర్లు సూచిస్తున్నారు.

ఇందులో భాగంగా ఓపెనర్‌గా రోహిత్‌ శర్మను తీసుకోవడం టీమిండియాకు అన్ని విధాలా మంచిదేనని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు.దీనిపై మైకేల్‌ ట్వీట్‌ చేశాడు. ఇలాంటి సమయాల్లో పృథ్వీ షా తొలిటెస్టుకు దూరం కావడం బాధాకరమైనదే. అతనిలో అద్భుతమైన టాలెంట్‌ దాగి ఉంది.

అతడి స్థానాన్ని రోహిత్‌ శర్మతో భర్తీ చేస్తే జట్టుకు మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం. టాప్‌ ఆర్డర్‌లో అతడు కచ్చితంగా ఉండాలి. రోహిత్‌ను తక్కువ అంచనా వేయకూడదు. టెస్టు క్రికెట్లో అతడు మాస్టర్‌ అని నేను అనడం లేదు. కానీ అతడు చాలా బాగా ఆడతాడని ట్వీట్‌ చేశాడు.