విశ్వం అంతా ఉచిత ఇంటర్నెట్ సేవల కోసం చైనాలో వై ఫై శాటిలైట్ ప్రయోగం

0
111
advertisment

మనఛానల్ న్యూస్ – టెక్నాలజీ డెస్క్
త్వరలో ప్రపంచ వ్యాప్తంగా ఉచితంగా ఇంటర్నెట్ ను అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు.అవి విజయవంతమైనందున దానికి సంబంధించిన ప్రైవేటు శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపనున్నారు.దీనికి సంబంధించిన తొలి శాటిలైట్ ను 2019లో గగనతలంలోకి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.

చైనాలోని నార్త్ వెస్ట్రన్ చైనాలోని ఘంసూ ప్రావిన్స్ లోని జియోకాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి శాటిలైట్ పంపనున్నారు. 2026 నాటికి విశ్వవాప్తంగా ఉచితంగా సంపూర్ణ ఇంటర్ నెట్ సౌకర్యాన్ని కల్పించడానికి ఈ 272 శాటిలైట్స్ ప్రయోగాలు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇందుకోసం 431 మిలియన్ డాలర్లను వ్యయం చేయనున్నారు.దీంతో విశ్వంలో ఎక్కడైనా ఇంటర్ నెట్ సౌలభ్యం ఏర్పడుతుంది.