పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోమారు తగ్గాయ్‌….!

0
21

మనఛానల్‌ న్యూస్‌ – బిజినెస్‌ డెస్క్‌
పెట్రోల్‌, డీజిల్‌ వినియోగదారులకు ఉపశమనం లభిస్తున్నది.దేశవ్యాప్తంగా ఇంధన ధరలు దిగివస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటంతో గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, ధరలు దిగొస్తున్న విషయం తెలిసిందే.

శుక్రవారం కూడా ఇంధన ధరలు మరికాస్త తగ్గాయి. దీంతో అక్టోబరు 18 నుంచి నవంబరు 30 వరకు పెట్రోల్‌ ధర దాదాపు రూ. 10 తగ్గడం విశేషం.శుక్రవారం దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర 37 పైసలు తగ్గి రూ. 72.87గా ఉంది. ఇక ధరలు అత్యధికంగా ఉండే ముంబయిలోనూ పెట్రోల్‌ ధర రూ. 78.43గా ఉంది.

కోల్‌కతాలో రూ. 74.88, చెన్నైలో రూ. 75.62గా ఉంది. డీజిల్‌ కూడా 41 పైసలు తగ్గి దిల్లీలో లీటర్‌ ధర రూ. 67.72గా ఉంది. ముంబయిలో రూ. 70.89, కోల్‌కతాలో రూ. 69.57, చెన్నైలో రూ. 71.52గా ఉంది.అక్టోబర్‌ 4న పెట్రోలు ధర రికార్డు స్థాయిలో దిల్లీలో లీటర్‌కు రూ.84కు చేరగా, ముంబయిలో రూ.91.34కు చేరింది.

అదేరోజు డీజిల్‌ అత్యున్నతస్థాయిలో దిల్లీలో రూ.75.45, ముంబయిలో రూ.80.10కి చేరింది. ఆ తర్వాత అక్టోబరు 18 నుంచి చమురు ధరలు దిగొస్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌ ధరపై రూ. 9.97 తగ్గింది. ఇదే సమయంలో లీటర్‌ డీజిల్‌పై దాదాపు రూ. 8 తగ్గింది.