పీటీఎం మండలంలో విశ్వం ప్రభాకర్‌రెడ్డి విస్తృత పర్యటన

0
130

మనఛానల్‌ న్యూస్‌ – బి.కొత్తకోట/పీటీఎం
తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా అన్ని మండలాల్లో విస్తృత పర్యటనలు చేస్తున్నారు విశ్వం (మలిపెద్ది) ప్రభాకర్‌ రెడ్డి. ఇందులో భాగంగానే శుక్రవారం పీటీఎం మండం బూర్లపల్లి గ్రామంలో పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహిం చారు.

ఈ సందర్భంగా గ్రామాల్లోని రైతులు, కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయలకు అతీతంగా ప్రజాసమస్యలను పరిష్కరించడం కోసం తనవంతు కృషి చేస్తానన్నారు. గత పాలకులు అవలంబించిన విధానాలతో తంబళ్లపల్లి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు.

దీనికితోడు తీవ్రవర్షాభావ పరిస్థితులతో వేసిన పంటలు చేతికి అందక రైతన్నలు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరువు నివారణ చర్యలు చేపట్టాలని, అదేవిధంగా రైతుల ఖాతాల్లోకి పంట పెట్టుబడి రాయితీలను జమ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. వ్యవసాయరంగం తర్వాత పాడిపరిశ్రమపై రైతులు అధికంగా ఆధారపడి జీవిస్తున్నా రన్నారు.

అయితే పాలకు సరైన గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫమైందన్నారు. పాలకు గిట్టుబాటు ధర లీటర్‌ రూ.30 చెల్లించాలన్నారు. నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.

ఇప్పటికే నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో విశ్వం యువసేన ద్వారా ప్రజాసమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందుకోసం హెల్ఫ్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పగడాల ప్రసాద్‌, కృష్ణారెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.