తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అజారుద్దీన్‌ నియామకం

0
189

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
భారతజట్టు మాజీ కెప్టెన్‌, మాజీ ఎంపి మహమ్మద్‌ అజారుద్దీన్‌కు కాంగ్రెస్‌ పార్టీ కీలక పదవిని అప్పజెప్పింది. ఆయనను తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది.

కాంగ్రెస్‌ పార్టీ నుంచి అజారుద్దీన్‌ రెండు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. 2009లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరదాబాద్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014లో రాజస్థాన్‌లోని టోంక్‌-సవాయ్‌ మాధోపూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

అయితే ఈసారి తెలంగాణ నుంచే పోటీ చేయాలని కాంగ్రెస్‌ తెలంగాణ యూనిట్‌ అజారుద్దీన్‌ను కోరింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్‌ లోక్‌సభా నియోజకవర్గం నుంచి అజారుద్దీన్‌ బరిలోకి దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.