ఓపెనర్‌ పృథ్వీ షాకు గాయం – ఆసీస్‌తో తొలి టెస్టుకు దూరం

0
18
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ ప్రారంభానికి ముందే భారతజట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో యువ సంచలన ఓపెనింగ్ ఆటగాడు పృథ్వీషా గాయపడ్డాడు.ఫీల్డింగ్‌ చేస్తుండగా అతడి కాలి మడమకు గాయమైంది. దీంతో అతడు నొప్పితోనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది.

డీప్‌ మిడ్‌ వికెట్‌ బౌండరీ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న షా.. ఆసీస్‌ ఓపెనర్‌ మాక్స్‌ బ్రయాంట్‌ కొట్టిన షాట్‌ను క్యాచ్‌ పడుతుండగా ఎడమ కాలి మడమకు గాయమైంది.బౌండరీ వద్ద క్యాచ్‌ పట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో షా ఎడమ కాలి మడమకు గాయమైంది. అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాం.

గాయం తీవ్రతపై స్కానింగ్‌ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నామని బీసీసీఐ తెలిపింది. ఇంతలోనే బీసీసీఐ మరో ట్వీట్‌ చేసింది. గాయం కారణంగా పృథ్వీషా తొలి టెస్టుకు దూరమయ్యాడని పేర్కొంది.అంతకుముందు ఆస్ట్రేలియా ఎలెవన్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో 19 ఏళ్ల పృథ్వీ షా దూకుడుగా ఇన్నింగ్స్‌ ఆరంభించాడు.

69 బంతుల్లో అతడు 11 ఫోర్లు బాదాడు. రెండో వికెట్‌కు షా పుజారాతో కలిసి 80 పరుగులు చేశాడు. షా 52 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తిచేశాడు. ఆడిలైడ్‌ వేదికగా ఆసీస్‌తో తొలి టెస్టు డిసెంబర్‌ 6న ప్రారంభం కానుంది.