అవకాశాలు లేక తమిళ వర్ధమాన నటి రియామిక ఆత్మహత్య

0
29
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
సినిమాల్లో సరైన అవకాశాలు రాకపోవడంతో తమిళ వర్ధమాన నటి రియామిక ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని వలసరవక్కంలోని తన ఇంటిలో గురువారం ఆమె ఉరి వేసుకుని తనువు చాలించారు.

ఈ మేరకు చెన్నై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. ‘కుమారనుక్కు కొండట్టం’, ‘అగోరియిన్‌ ఆట్టం’, ‘ఎక్స్‌ వీడియోస్‌’ తదితర చిత్రాలతో గుర్తింపు పొందిన రియామిక తన సోదరుడు ప్రకాష్‌తో కలిసి నివాసం ఉంటున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దినేష్‌ అనే వ్యక్తితో రియామిక ప్రేమలో ఉన్నారు.

సినిమా ఆఫర్లు లేక ఆమె కొన్ని నెలలుగా కుంగుబాటులో ఉన్నారు. మనసు బాగోలేదని ఓ రోజు రాత్రి ఆమె దినేష్‌కు ఫోన్‌ చేశారు. ఇంటికి రమ్మని పిలిచారు.. కానీ ఆయన ఉదయం వస్తానని చెప్పారు. అనంతరం సోదరుడు ప్రకాశ్‌తో ఆమెకు చిన్న గొడవ అయ్యింది. తర్వాత ఇద్దరు నిద్రపోయారు.

ఉదయం రియామిక ఇంటికి వచ్చిన దినేష్‌ ఆమె నిద్రపోతుండటంతో ప్రకాష్‌‌తో కలిసి వంటచేద్దామని వెళ్లారు. ఇంతలో రియామిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు నటి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు.