డిసెంబర్‌ 24 నుండి ఏపీ డీఎస్సీ-2018 రాతపరీక్షలు

0
95

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
డిసెంబర్‌ 24, 2018 నుండి ఏపీ డీఎస్సీ రాతపరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. రెండువారాలు వాయిదా వేస్తున్నట్లు తొలుత ప్రకటించినా మరో వారం పొడగిస్తూ మొత్తం మూడువారాలు వాయిదా వేస్తూ సవరించిన షెడ్యూల్‌ను మంత్రి గంటా విడుదల చేశారు.

అభ్యర్థుల వినతుల మేరకు పరీక్షలను రెండు వారాలు వాయిదా వేస్తున్నట్లు మంగళవారం మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటిం చిన విషయం విదితమే. ఇదే క్రమంలో బుధవారం మధ్యాహ్నం రాజమహేంద్రవరంలో ఆయన డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను విడు దల చేశారు. ఈ షెడ్యూల్‌లో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులకు సమయం పొడిగింపు ఇవ్వలేదు. వారు తమకు రెండు వారాల సమయం లభించేలా చూడాలని కోరారు.

అదే షెడ్యూల్‌లోని స్కూల్‌ అసిస్టెంట్‌ భాషలు, పోస్టుగ్రాడ్యుయేషన్‌ ఉపాధ్యాయ(పీజీటీ) పరీక్షల రోజునే కేంద్రీయ విద్యాలయ ఉపాధ్యాయ పరీక్షలు ఉన్నాయి. ఇది కొంత గందరగోళానికి కారణమైంది. దీంతో బుధవారం మంత్రి విడుదల చేసిన షెడ్యూల్‌తో పాటు మొత్తం షెడ్యూల్‌నే మార్పు చేసి రాత్రి అధికారులు విడుదల చేశారు. డీఎస్సీ పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించ నున్నారు.

డీఎస్సీ పరీక్షల నిర్వహణకు కొత్తగా విడుదల చేసిన షెడ్యూల్

– హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్‌ : డిసెంబరు 10 నుంచి
– స్కూలు అసిస్టెంట్‌ (భాషేతర) పరీక్షలు : డిసెంబరు 24, 26, 27 (మూడు రోజులు)
– స్కూలు అసిస్టెంట్‌ (భాషలు) : డిసెంబరు 28న
– పోస్టుగ్రాడ్యుయేట్‌ ఉపాధ్యాయ : డిసెంబరు 29న
– ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ ఉపాధ్యాయ, వ్యాయామ(పీఈటీ) : డిసెంబరు 30 నుంచి జనవరి 1, 2019 వరకు (మూడు రోజులు)
– ప్రిన్సిపళ్లు, మ్యూజిక్‌, క్రాఫ్ట్‌, ఆర్ట్‌, డ్రాయింగ్‌ : జనవరి 2న
– భాషాపండితులు : జనవరి 3న
– సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ(ఎస్జీటీ): జనవరి 18 నుంచి 30వరకు (13రోజులు)