చైనా రసాయన కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం – 22 మంది మృతి

0
35
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఇంటర్నేషనల్‌ డెస్క్‌
చైనాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.దేశ రాజధానికి 200 కి.మీ. దూరంలో ఉన్న జాంగ్జియాకవు నగరంలోని ఓ రసా యన కర్మాగారంలో సంభవించిన పేలుడు భారీ అగ్నిప్రమాదానికి దారి తీసింది. ఈ ఘటనలో 22 మంది సజీవదహన          మయ్యారు.

మరో 22 మందికి పైగా గాయపడ్డారు. కర్మాగారానికి సమీపంలో నిలిపి ఉంచిన 50 వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

జాంగ్జియా కవులోని హెబై షెంగువా రసాయన కర్మాగారంలో పేలుడు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.అర్థరాత్రి ఈ పేలుడు జరిగిందని తెలిపారు. క్షతగాత్రులను సహాయక సిబ్బంది ఆస్పత్రికి తరలించారని చెప్పారు.

కంపెనీ సమీపంలో ఉన్న పెద్ద, చిన్న ట్రక్కులు మంటల్లో కాలిపోయి రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎవరైనా మంటల్లో చిక్కుకున్నారేమోనని సహాయక సిబ్బంది గాలిస్తున్నారు.