భారత్ లోని భువనేశ్వర్‌ వేదికగా రేపటి నుండి ప్రపంచకప్‌ హాకీ సంగ్రామం

0
28
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
భారతదేశపు జాతీయ క్రీడ హాకీ. అయితే 1971 నుండి జరుగుతున్న ప్రపంచకప్‌లో తొలి మూడు ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించింది భారతజట్టు. ఇదే కోవలోనే 1975లో జరిగిన ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత అనుకున్న స్థాయిలో రాణించలేకపోతోంది. అయితే సొంత ప్రేక్షకులల మధ్య తమ సత్తా చాటడానికి భారతజట్టుకు మంచి అవకాశం లభించింది.

అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచకప్‌కు ఈ ఏడాది భారత్‌ ఆతిథ్యమిస్తోంది. బుధవారం నుంచి ఒడిశాలోని భువనేశ్వర్‌ వేదికగా ఈ మెగా ఈవెంట్‌ జరగనుంది. 19 రోజుల పాటు జరిగే టోర్నీలో 16 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి 36 మ్యాచుల్లో తలపడనున్నాయి. అప్పుడెప్పుడో 1975లో విశ్వవిజేతగా నిలిచిన మన జట్టు 43 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించేందుకు ఇదే మంచి తరుణం.

ఈసారి అంతా కుర్రాళ్లతో కూడిన భారత జట్టుకు మన్‌ప్రీత్‌సింగ్‌ సారథ్యం వహిస్తున్నాడు. మన్‌ప్రీత్‌తో పాటు సీనియర్లు అయిన మాజీ కెప్టెన్‌, గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్‌, ఆకా్‌షదీప్‌ సింగ్‌, బీరేంద్ర లక్రాలు జట్టులో జూనియర్లకు మార్గనిర్దేశనం చేయనున్నారు. రెండేళ్ల క్రితం జూనియర్‌ ప్రపంచకప్‌ నెగ్గిన యువ భారత్‌లోని ఏడుగురు ఆటగాళ్లు ఈసారి సీనియర్‌ జట్టులో ఉన్నారు. అంతేకాదు నాటి యువ జట్టు కోచ్‌ హరేంద్ర సింగ్‌ ప్రస్తుతం సీనియర్‌ జట్టు శిక్షకుడు కావడం విశేషం.

ఆస్ర్టేలియా, నెదర్లాండ్స్‌, జర్మనీ జట్లు టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాయి. ప్రపంచక్‌పకు ఆతిథ్యమివ్వడం భారత్‌కిది మూడోసారి. తొలిసారిగా 1994లో బొంబాయి వేదికగా జరిగిన టోర్నీలో భారత్‌ ఐదోస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 2010 ఢిల్లీ వేదికగా ఎనిమిదోస్థానంతో సరిపెట్టుకుంది. బుధవారం నుంచి ప్రధాన మ్యాచ్‌లు జరగనుండగా మంగళవారం ప్రారంభ వేడుకలు జరగనున్నాయి.

ఆరంభ వేడుకలకు షారుఖ్‌ ఖాన్‌, మాధురి దీక్షిత్‌

సంగీత మాంత్రికుడు ఏఆర్‌ రెహ్మాన్‌, బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, మాధురి దీక్షిత్‌ హాకీ ప్రపంచకప్‌ ఆరంభ వేడుకల్లో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. మంగళవారం సాయంత్రం 5.30కు భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో ఆరంభ వేడుకలు ప్రారంభమవుతాయి. బారాబతి స్టేడియంలో రెండోరోజు జరిగే ప్రత్యేక కార్యక్రమంలో సల్మాన్‌ ఖాన్‌ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు

గ్రూపులు

advertisment

పూల్‌ ఎ: అర్జెంటీనా, స్పెయిన్‌, న్యూజిలాండ్‌, ఫ్రాన్స్‌
పూల్‌ బి: ఆస్ర్టేలియా, ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌, చైనా
పూల్‌ సి: బెల్జియం, భారత్‌, కెనడా, దక్షిణాఫ్రికా
పూల్‌ డి: నెదర్లాండ్స్‌, మలేసియా, జర్మనీ, పాకిస్తాన్‌