తాలిబన్ల దాడిలో 20 మంది ఆప్ఘన్‌ పోలీసుల మృతి

0
24
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఇంర్నేషనల్‌ డెస్క్‌
ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్‌లు వరుస దాడులలతో చెలలరేగిపోతున్నారు. దీంతో సామాన్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవితాలను గడుపుతున్నారు. తాజాగా తాలిబ‌న్లు జ‌రిపిన దాడిలో 20 మంది పోలీసులు మృతిచెందారు.

ఈ ఘ‌ట‌న ఫ‌రాహ్ ప్రావిన్సులోని జ‌వాన్ జిల్లాలో జ‌రిగింది. ఆదివారం ఈ సంఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు అధికారులు ఇవాళ వెల్ల‌డించారు. ఇటీవ‌ల ఆఫ్ఘ‌న్ ఆర్మీ, సెక్యూర్టీ ద‌ళాల‌పై తాలిబ‌న్లు వ‌రుస దాడుల‌తో చెల‌రేగిపోతున్నారు. అయితే ఫరాహ్ ప్రావిస్సులో పోలీసు కాన్వాయ్‌పై తాజాగా తాలిబ‌న్లు దాడి చేశారు.

దాదాపు స‌గంపైన ప్రాంతాల్లో తాలిబ‌న్లు భీక‌ర దాడులు నిర్వ‌హిస్తూ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు.ఇటువంటి దాడుల్లో అమాయకులైన ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి.

వీటిని అరికట్టడానికి ఐక్యరాజ్య సమితి చర్యలు చేపట్టినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండాపోతోంది. ఉగ్రవాదం ప్రపంచ శాంతికి పెనువిఘాతంగా మారిపోయింది.