304వ రోజుకు చేరుకున్న వై.ఎస్‌.జగన్‌ ప్రజాసంకల్పయాత్ర

0
183

మనఛానల్‌ న్యూస్‌ – విజయనగరం
ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తిలకించి, వారికి తానున్నానంటూ భరోసా కల్పించేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 304వ రోజుకు చేరుకుంది.

ప్రస్తుతం ఈ పాదయాత్ర విజయనగరం జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లోని ప్రజలు ఈ ప్రజాసంకల్ప యాత్రకు బ్రహ్మరథం పట్టారు. వై.ఎస్‌.జగన్‌ 304వ రోజు పాదయాత్రను కురుపాం నియోజకవర్గం జీయమ్మవలస మండలం శిఖబడి క్రాస్‌ నుండి ప్రారంభించారు.

వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జగన్‌ ముందుకు కదులుతున్నారు.

అక్కడి నుంచి బిజేపురం, గెద్ద తిరువాడ, యిటిక, కుందర తిరువాడ క్రాస్‌, చిన్న కుదమ క్రాస్‌ మీదుగా తురకనాయుడు వలస వరకు పాదయాత్ర కొనసాగనుంది.