స్మిత్‌, వార్నర్‌లపై నిషేధం ఎత్తివేసే ప్రసక్తే లేదు – క్రికెట్‌ ఆస్ట్రేలియా

0
310

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
స్మిత్‌, వార్నర్‌లపై నిషేధం ఎత్తివేసే ప్రసక్తే లేదని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) మంగళవారం తెగేసి చెప్పింది. గత కొంతకాలంగా ఆస్ట్రేలియన్‌ క్రికెటర్స్‌ అసోషియేషన్‌(ఏసీఏ) ఆ ముగ్గురు క్రికెటర్లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతోంది.

మంగళవారం చైర్మన్‌ ఎడ్డింగ్స్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. క్రికెట్‌కు, దేశానికి మాయని మచ్చ తెచ్చిన ఆ క్రికెటర్లను ఉపేక్షించేది లేదని సమావేశం తర్వాత ఎడ్డింగ్స్‌ పేర్కొన్నారు.ఇంటా బయట ఓటములతో ఆస్ట్రేలియా గడ్డుకాలాన్ని ఎదుర్కోంటోంది.

ఈ తరుణంలో జట్టులో సమతుల్యం దెబ్బతిన్నదని, కీలక టీమిండియా పర్యటన నేపథ్యంలో స్మిత్‌, వార్నర్‌లపై ఉన్న నిషేధాన్ని సడలించాలని ఏసీఏ కోరుతోంది. అయితే ఆటగాళ్లపై నిషేధాన్ని సడలిస్తే భవిష్యత్‌ క్రికెట్‌కు మంచిది కాదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణ యం తీసుకున్నామని సీఏ ప్రకటించింది.

దీనిపై ఏసీఏ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆస్ట్రేలియా క్రికెట్‌ పరిస్థితుల కంటే కన్నా వారి పంతమే ముఖ్యమని సీఏ భావిస్తోందని దుయ్యబట్టారు.