ప్రజాసమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత – మదనపల్లి సబ్‌కలెక్టర్‌ కీర్తి చేకూరి

0
520

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
ప్రజాసమస్యలను పరిష్కరించడానికే తొలి ప్రాధాన్యతను ఇస్తున్నట్లు మదనపల్లి సబ్‌కలెక్టర్‌ కీర్తి చేకూరి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీ దారులను ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించా లన్నారు. సోమవారం ఉదయం సబ్ కలెక్టరేట్ కార్యాలయం నందు నిర్వహించి ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల, డివిజన్ స్థాయి అధికారులు ఉదదయం 10.30 గంటలకు హాజరు కావాలని తెలిపారు.

ముందుగా సబ్ కలెక్టర్ గారు ఏయే శాఖ అధికారులు ఉన్నారని అడగగా ప్రజావాణికి హాజరైన అధికారులు సబ్ కలెక్టర్ గారిని పరిచయం చేసుకున్నారు. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే డివిజన్ స్థాయి అధికారులు సబ్ కలెక్టర్ గారికి డి.ఎల్.పి.ఓ లక్ష్మి, అసిస్టెంట్ కమీషనర్ చిన్నలాలెప్ప, గృహనిర్మాణ శాఖ ఏ.ఈ.వెంకటరెడ్డి, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి హరిశ్చంద్ర ప్రసాద్, పట్టు పరిశ్రమల శాఖ అధికారి రఘునాధరెడ్డి, డ్వామా ఏ.పి.డి చందన, పౌరసరఫరాల శాఖ డి.టి అమర, డిప్యూటీ సర్వేయర్ గురుమూర్తి, వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్చం ఇచ్చి శాలువతో సన్మానించి అభినందనలు తెలిపారు.

అనంతరం ఉదయం 10.30 గంటల నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ప్రజావాణి (మీ-కోసం) కార్యక్రమం మద్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించారు. మీ-కోసం కార్యక్రమానికి డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చి ప్రజలు అర్జీలను నేరుగా సబ్ కలెక్టర్ గారికి అందజేశారు.

ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించి నిశితంగా పరిశీలించి అర్జీదారుల నుండి భూ సమస్యలకు సంబంధించి వెంటనే ఫోన్ ద్వారా సంబంధిత తహశీల్దార్ లను సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని ఆదేశించారు.అర్జీదారుల సమస్యలను పరిశీలించి సమస్యను పరిష్కారం, అవుతున్నాయా లేదా అని నిర్ణయించి అర్జీదారులకు సమాధానం తెలపాలే తప్ప, అర్జీదారులను ప్రతి వారం ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా వెంటనే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదే శించారు.

మదనపల్లి, గుర్రంకొండ, రామసముద్రం, శాంతిపురం, గంగవరం, రొంపిచెర్ల, తంబలపల్లి, యర్రావారి పాల్యం, సదుం, కె.వి పల్లె, సదుం సోమల మండలాలకు చెందిన, అర్జీదారులు రేషన్ కార్డ్స్, పించన్లు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇంటి పట్టాలు, భూ సర్వే, భూ సమస్యలు, గృహాల మంజూరు, గృహాలకు బిల్లులు, హంద్రి-నీవా సుజల స్రవంతికి (హెచ్.ఎన్.ఎస్), నేషనల్ హైవే (ఎన్.హెచ్)కి, భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం, పట్టాదారు పాసు పుస్తకాలు,

ఈ-పాసు పుస్తకాలు, భూములు ఆన్ లైన్ చేయించాలని, 1-బి, ద్వారా కో-ఆపరేటివ్ జాయింట్ ఫార్మర్స్ సొసైటీ (సి.జి.ఎఫ్.ఎస్) భూములు, గృహాలకు స్థలం మంజూరు చేయాలని, త్రాగు నీటి సమస్యలు, దారి, కోర్టులో ఉన్న కేసులు సంబంధించిన సమస్యలు అర్జీలను నేరుగా, సబ్ కలెక్టర్ గారికి అర్జీదారులు అందజేశారు. వీటిని పరిశీలించి సంబంధిత శాఖ అధికారులకు అందజేసి, పరిష్కారానికి చర్యలను తీసుకోవాలని తెలిపారు.

మీ పరిధిలో లేని అర్జీదారుల సమస్యలను జిల్లా స్థాయి అధికారులకు పంపించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న సమాచారమును శనివారం సాయంత్రానికి సబ్ కలెక్టర్ కార్యాలయానికి అందజేయాలని డివిజన్ స్థాయి అధికారులను ఆదేశించారు.

– సదుం మండలం, చెరుకువారిపల్లి పంచాయతి, మర్తువారిపల్లి గ్రామస్తులు సుమారు 15 ఎస్.సి.కుటుంబాల వారు, సర్వే నంబర్ 424,429 యందు సుమారు 48 ఎకరాల భూమిని కొన్ని సంవత్సరములుగా మేము సాగు చేసుకుంటున్నామని మాకు పట్టాలు అందజేయాలని అర్జీని సబ్ కలెక్టర్ గారికి అందజేశారు. సబ్ కలెక్టర్ వారితో మాట్లాడుతూ ప్రభుతం భూ పంపిణీ కార్యక్రమం సంధర్బంగా మీకు పట్టాలు ఇవ్వడం జరుగుతుందని వారికి తెలిపారు.

– ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో సంభవించిన తిత్లీ తుపానుకు గురి అయి నష్టపోయిన వారికి సహాయం చేస్తున్న 16 మంది ప్రజా సంఘ నాయకులను అరెస్టు చేశారని, వారిని వెంటనే బేషరతులుగా విడుదల చేయాలి,వారిపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే రద్దు చేయాలి. శనివారము రాత్రి గ్రుహ నిర్భంధంలో ఉన్న హక్కుల నాయకుడు వవరరావును పుణె పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం. వరవరరావును కుడా బేషరతులుగా విడుదల చేయాలని అర్జీని సమర్పించారు.

– మదనపల్లి మండలం,కోళ్లబైలు పంచాయతీ, వెంకటేశ్వరపురంలో ఉన్న 4 సంవత్సరాల బాలికపై హత్యాచారం చేశాడని, ఆ నిందితున్ని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికల అల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ మదనపల్లి డివిజన్ కౌన్సిల్ సభ్యులు నిందితున్ని కఠినంగా శిక్షించాలని అర్జీని సమర్పించారు.

ఈ సందర్బంగా వారితో సబ్ కలెక్టర్ మాట్లాడుతూ జరిగిన సంఘటన చాలా భాదాకరమని, దీనిపైన విచారణ చేపట్టి నిందితున్ని కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాలికలు బాలురుతో సమానంగా ధైర్యంగా ఉండాలని మిమ్ములను ఎవరైనా ఇబ్బందులుకు గురి చేస్తుంటే వెంటనే పోలీస్ అధికారులకు, సంబందిత అధికారులకు వెంటనే తెలిపారని వారికి సూచించారు. మీ కళాశాలలో సెల్ఫ్ డిఫెన్స్ ఉన్నాయా లేదా లేకుంటే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వారికి సూచించారు.

మీ-కోసం కార్యక్రమంలో ఏ.ఓ సురేష్ బాబు, కార్మిక శాఖ అసిస్టెంట్ కమీషనర్ చిన్నలాలెప్ప, గృహనిర్మాణ శాఖ ఏ.ఈ వెంకటరెడ్డి, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి హరిశ్చంద్ర ప్రసాద్, పట్టు పరిశ్రమ శాఖ అధికారి రఘునాధరెడ్డి, డ్వామా ఏ.పి.డి చందన, పౌరసరఫరాల శాఖ డి.టి అమర, డిప్యూటీ సర్వేయర్ గురుమూర్తి, వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.