తెలుగుదేశం ఆస్ట్రేలియా విభాగం ఆధ్వర్యంలో కార్తీకమాస వనబోజన మహోత్సవం

0
151
advertisment

మనఛానల్ న్యూస్ – సిడ్ని(అస్టేలియా ప్రతినిధి)

ఆస్ట్రేలియాలో ప్రధాన నగరం సిడ్నీలో తెలుగుదేశంపార్టీ ఆస్ట్రేలియా ఎన్.ఆర్.ఐ విభాగం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వెస్ట్రన్ సిడ్నీ లో బుంగరీబీ పార్క్ వద్ద ఈ ఉత్సవాలను ఆనందోత్సవాలతో జరుపుకొన్నారు.

తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు విదేశాలలో సైతం మరిచ పోకుండ ఉండాలనే సత్సంకల్పం తో తెలుగుదేశం ఆస్ట్రేలియా విభాగం ఏటా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ఆస్ట్రేలియా విభాగం ఎగ్జిక్యూటివ్ అధ్యక్షులు పల్లపోతు శ్రీనివాస రావు మరియు ఉపాధ్యక్షులు తరగంబడి రవికిరణ్ లు మనఛానల్ ప్రతినిధికి తెలిపారు.

సిడ్నీ మరియు కాన్ బెర్రా తదితరా ప్రాంతాల నుంచి అనేక మంది తెలుగు ఈ వనభోజనాల కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గోనడం పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్తీక వనభోజన కార్యక్రమం ద్వారా అందరం కలసి భోజనం చెయ్యడమే కాక ,పిల్ల పెద్ద అంతా ఆడి, పాడి వినోద కాలక్షేపం చేసి ప్రతి ఒక్కరూ ఎంతో సంతృప్తి చెందారని అన్నారు.

advertisment

ఈ సందర్భంగా అంత్యాక్షరి, జంటలకు సరదా ఆటలు, పిల్లలకు మ్యూజికల్ చైర్స్ వంటి పలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. వనభోజన కార్యక్రమం పాలుపంచుకున్న వారందరికి తెలుగుదేశం ఆస్ట్రేలియా అధ్యక్షులు పల్లపోతు శ్రీనివాస రావు మరియు ఎగ్జిక్యూటివ్ కమిటి ధన్యవాదాలు తెలియజేసింది.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఆస్ట్రేలియా విభాగం కమిటి అధ్యక్షులు పల్లపోతు శ్రీనివాస రావు,తరగంబడి రవికిరణ్ ( ఉపాధ్యక్షులు), నిమ్మగడ్డ సుభాష్ చంద్ర (కోశాధికారి),సుంకర రఘు ( కార్యదర్శి),వంకినేని సాయి తేజ ( సంయుక్త కార్యదర్శి)కొర్రపాటి అంకమ్మ చౌదరి (కార్యవర్గ సభ్యులు)పాతూరి పుణ్యవతి (కార్యవర్గ సభ్యులు) కొల్లూరి రమ్య (కార్యవర్గ సభ్యులు)దావులూరి పూర్ణచంద్ (కార్యవర్గ సభ్యులు)గద్దె ఉమా మహేశ్వర రావు(కార్యవర్గ సభ్యులు),అన్నే అంజయ్ చౌదరి (కార్యవర్గ సభ్యులు),కోనేరు వినీల్ (కార్యవర్గ సభ్యులు),గద్దె సతీష్ (అసోసియేట్ ఎగ్జిక్యూటివ్)తదితరులు పాల్గోన్నారు.