తానా సభల నిర్వహణకు వాషింగ్టన్ లో నిధుల సేకరణ

0
13

మనఛానల్ న్యూస్ – ఎన్.ఆర్.ఐ విభాగం
వచ్చే ఏడాది (2019) జులై 4,5,6 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో నిర్వహించనున్న 22వ తానా ద్వైవార్షిక మహాసభల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా కార్యక్రమం నిర్వహణ కోసం కావాల్సిన నిధుల సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం నాడు డీ.సీ మెట్రో ఏరియా ఐటీ వ్యాపారవేత్తలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో 100కు పైగా ఐటీ సంస్థలు అధినేతలు పాల్గొని తానా సభల నిర్వహణకు తమవంతుగా నిధులను, కార్యకర్తలను, పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని పేర్కొన్నారు. తానా సంస్థ పట్ల నమ్మకంతో చొరవగా ముందుకు వచ్చి తమ సహకారాన్ని అందిస్తున్న వీరందరికీ తానా అధ్యక్షుడు వేమన సతీష్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రవాస తెలుగు ప్రముఖులు డా.మూల్పూరి వెంకటరావు, డా.యడ్ల హేమప్రసాద్ తదితరులు పాల్గొన్నారు