నవంబర్‌ 3 నుండి ప్రజాసంకల్పయాత్ర పునఃప్రారంభం

0
27
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – విజయనగరం
నవంబర్‌ 3వ తేదీ నుండి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పునఃప్రారంభ మవుతుందని వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు వెల్లడించారు.

సీతానగరం మండలంలో ఆయన సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలో పాదయాత్ర పూర్తి చేసుకొని 4న పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం బగ్గందొరవలసలో ప్రారంభమవు తుందన్నారు. 6న పార్వతీపురంలో బహిరంగ సభ నిర్వహిస్తారన్నారు.

అయితే విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్‌ హత్యాయత్నానికి గురైన సంగతి విదితమే. జగన్‌కు చికిత్స నిర్వహించిన వైద్యులు వారంపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో పాదయాత్రకు కొంత విరామమేర్పడినట్లు ఆయన తెలిపారు.

ఆయన క్షేమంగా ఉండాలని ప్రజలు చేసిన పూజలు ఫలించాయని, ఆయన తన కార్యకలాపాలను తిరిగి యధావిధిగా కొనసాగిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.