అత్యంత విషమంగా మారిన మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి ఆరోగ్యం

0
537

మనఛానల్‌ న్యూస్‌ – విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది.ఆమె శరీరం వైద్యానికి పూర్తిగా సహకరించడం లేదని వైద్యులు తెలిపారు.సోమవారం నాటికి ఆమె పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.

గత మూడు రోజులుగా విశాఖ పినాకిల్‌ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నా ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. ఆమె శరీరంలోకి రక్తం ఎక్కకపోవడంతో వైద్యులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ గాని, బెంగళూరు గాని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది.

ప్రతిభా భారతి తండ్రి కొత్తపల్లి పున్నయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రతిభాభారతి భర్త కావలి కృష్ణప్రసాద్‌ అస్వస్థతకు గురయ్యారు.

తన భార్యతో పాట మామయ్య చికిత్స పొందుతున్న పినాకిల్‌ ఆస్పత్రిలో ఆదివారం వరకు కృష్ణప్రసాద్‌ ఉన్నారు. సాయంత్రం కావలి గ్రామానికి చేరుకున్న కృష్ణప్రసాద్‌కు షుగర్‌, బీపీ పెరగడంతో స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు.