పెళ్లిరోజు కోసం ఎదురు చూస్తున్నానంటున్న దీపికా పదుకొనే

0
41
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
బాలీవుడ్‌ ప్రేమజంట రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనేలు త్వరలో పెళ్లిపీటలెక్క బోతున్న సంగతి విదితమే. ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో నవంబరు 14, 15 తేదీల్లో వీరి పెళ్లి జరగబోతోంది.

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నేపథ్యంలో దీపిక ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఓ పత్రికతో మాట్లాడారు. పెళ్లి కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. నాకు చాలా ఉత్సుకతగా ఉంది. ఓ కొత్త ప్రాజెక్టుకు సంతకం చేస్తే ఎలా ఫీల్‌ అవుతానో అలా ఉంది.

ఓ సాధారణ అమ్మాయిలా నేనూ పెళ్లి కోసం ఎదురుచూస్తున్నా. ఇది ఓ అందమైన అనుభూతి. నవతరం పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు పాత్ర చాలా తక్కువ ఉంటోందని ఆమె అన్నారు.

ఇటలీలోని లేక్‌ కోమోలో దీపిక, రణ్‌వీర్‌ వివాహం అంగరంగ వైభవంగా జరగబోతున్నట్లు తెలుస్తోంది. దీపిక బెంగళూరుకు చెందిన అమ్మాయి, రణ్‌వీర్‌ మహారాష్ట్ర సింధి కుటుంబానికి చెందిన అబ్బాయి కావడంతో వీరి పెళ్లిని రెండు సంప్రదాయాల ప్రకారం చేయబోతున్నారట.