బుచ్చిరెడ్డిగారిపల్లి పాఠశాలలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి

0
58
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – బి.కొత్తకోట
చిత్తూరుజిల్లా బి.కొత్తకోట మండలం బుచ్చిరెడ్డిగారిపల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నందు బుధవారం వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ప్రధానోపాధ్యాయులు పి.ఢిల్లీ ప్రసాద్‌ మాట్లాడుతూ వాల్మీకి సంస్కృత భాష కు ఆది కవి అని, రామాయణాన్ని రచించా డనితెలిపారు. లక్ష్మి, సరస్వతిదేవి ల కటాక్షం పొందడానికి “ఓం ఐం హ్రీం క్లీం శ్రీం” అనే బీజాక్షరాల మంత్రాలను లోకానికి పరిచ యం చేశాడని, “కౌసల్యా సుప్రజా రామా” అనే సుప్రభాతాన్ని రచించాడని తెలిపారు.

వాల్మీకి యోగా,ధ్యానంల గురించి పుస్తకం రాయడంతో పాటు వాల్మీకి మతాన్ని స్థాపించాడని, శ్లోకం అనే ప్రక్రియలను కనుగొ న్నాడని ఆయన వివరించారు. నేటితరం కవులు వాల్మీకి మహర్షిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.

ఎంతో మేథోసంపత్తి కలిగిన వాల్మీకి మహర్షి జయంతిని మనం ప్రతి ఏడాది జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగమణి, విజయలక్ష్మి, లక్ష్మి, ప్రభాకర రెడ్డి, సిఆర్పీ వెంకటరమణ మరియు విద్యార్ధులు పాల్గొ న్నారు.