కాస్త ఉపశమనం – వరుసగా ఐదోరోజు తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

0
23
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – బిజినెస్‌ డెస్క్‌
ఇప్పటికే ఆల్‌టైం రికార్డుకు చేరిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో బెంబేలెత్తిన సామాన్య ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. వరుసగా ఐదో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్వల్ప౦గా తగ్గాయి.

దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర 30 పైసలు తగ్గి రూ.81.34గా ఉంది. ఇక డీజిల్‌ కూడా 27 పైసలు తగ్గి లీటర్‌ ధర రూ. 74.92గా ఉంది.ధరలు అత్యధికంగా ఉండే ముంబయిలోనూ ఇంధన ధరలు కాస్త తగ్గాయి. ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర 30 పైసలు తగ్గి రూ. 86.91గా ఉంది.

లీటర్‌ ధర 28 పైసలు తగ్గి రూ. 78.54గా ఉంది. అక్టోబరు 4న ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రికార్డు స్థాయిలో రూ. 91.34కు చేరిన విషయం తెలిసిందే. గత ఐదు రోజుల్లో పెట్రోల్‌పై రూ. 1.39పైసలు, డీజిల్‌పై 80 పైసల వరకు తగ్గింది.

అక్టోబరు 5వ తేదీన ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్రం తగ్గించడంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరపై రూ.2.50 వరకూ తగ్గింపు లభించిన సంగతి తెలిసిందే. కొన్ని భాజపా పాలిత రాష్ట్రాలు వ్యాట్‌ను కూడా తగ్గించడంతో వినియోగదారులకు మరికొంత ఉపశమనం లభించింది.